
అమెరికా, పాకిస్తాన్ మధ్య మంగళవారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫర్హాన్ 73 పరుగులు, బాబర్ అజమ్ 46 పరుగులతో రాణించారు. షాదాబ్ ఖాన్ 30 పరుగులు, సయీమ్ అయూబ్ 19 పరుగులు చేశారు. పాకిస్తాన్ తొలుత దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ USA పేసర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్ ఆ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. 4 వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటర్ల జోరుకు బ్రేకులు వేశాడు. మహ్మద్ మొహ్సిన్, హర్మీత్ సింగ్, నేత్రవాల్కర్ తలో వికెట్ తీశారు.
ఒకానొక దశలో పాకిస్తాన్ బ్యాటర్ల ఆట తీరు చూసి స్కోర్ 200 దాటుతుందనే అంచనా ఏర్పడింది. కానీ.. 19, 20 ఓవర్లలో అమెరికా బౌలర్ల ధాటికి పాక్ బ్యాటింగ్ కకావికలమైంది. 19వ ఓవర్లో రెండు వికెట్లు, 20వ ఓవర్ లో మూడు వికెట్లు పడటంతో పాక్ కథ ముగిసింది. 19వ ఓవర్లో 6 పరుగులు, 20వ ఓవర్లో 11 పరుగులను పాక్ రాబట్టగలిగింది.
191 పరుగుల లక్ష్యంతో అమెరికా బ్యాటింగ్కు దిగనుంది. భారీ టార్గెట్ అయినప్పటికీ న్యూజిలాండ్తో వామప్ మ్యాచ్లో 200 పరుగులకు పైగా చేసిన హిస్టరీ అమెరికా క్రికెట్ టీంకు ఉంది. అయితే.. బలమైన పాక్ బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కొని అమెరికా బ్యాటర్లు ఈ భారీ టార్గెట్ను ఎలా ఛేజ్ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
#SahibzadaFarhan’s brilliant half-century, followed by a late cameo from #ShadabKhan, helped Pakistan post a challenging total against the USA. 🔥
Will the USA chase this down, or will Pakistan dominate? ✍🏻
ICC Men’s #T20WorldCup | #PAKvUSA | LIVE NOW 👉 https://t.co/97PRnnpgoP pic.twitter.com/xVGExSP8aL
— Star Sports (@StarSportsIndia) February 10, 2026