Reading Time: 1 minute

OTT Political Drama: పొంగల్ రేసులో సంచలన విజయం.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన హిట్ మూవీ

Caption of Image.

తమిళ టాలెంటెడ్ యాక్టర్ జీవా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘తలైవర్ తంబి తలైమైయిల్’ (Thalaivar Thambi Thalaimaiyil). ఈ పొలిటికల్ కామెడీ డ్రామా, ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 12, 2026  నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇందులో తంబి రామయ్య, ఇలవరసు, ప్రార్థన నాథన్ కీలక పాత్రలు పోషించారు.ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – సంక్రాంతి బరిలో విడుదలైన భారీ సినిమాల మధ్య ఈ చిత్రం పోటీకి దిగింది. ముఖ్యంగా కార్తి నటించిన ‘అన్నగారు వస్తున్నాడు’ సినిమాతో పోటీపడి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడం విశేషం. తక్కువ అంచనాలతో వచ్చిన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ సాధించింది.

ఆసక్తికరమైన కథాంశం:

‘తలైవర్ తంబి తలైమైయిల్’ ఒక వినూత్నమైన విలేజ్ పొలిటికల్ కామెడీ డ్రామా. ఈ చిత్రంలో జీవా ‘జీవరత్నం’ అనే పంచాయతీ లీడర్ పాత్రలో కనిపిస్తాడు. గ్రామంలో జరిగే ఒక పెళ్లి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే బాధ్యతను అతడు తీసుకుంటాడు. అలా ఇళవరసు (ఇళవరసు) ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, అదే సమయంలో పక్కింట్లో నివసించే మణి (తంబి రామయ్య) కుటుంబంలో ఒకరు మరణిస్తారు.

►ALSO READ | Couple Friendly: టైటిల్ కారణంగానే ‘కపుల్ ఫ్రెండ్లీ’కు A సర్టిఫికెట్.. సెన్సార్ సూచనలపై నిర్మాత కామెంట్స్

ఒకవైపు పెళ్లి సందడి, మరోవైపు చావు విషాదం.. ఈ రెండు విభిన్న పరిస్థితుల మధ్య జరిగే గందరగోళం, హాస్యభరితమైన సంఘటనలే ఈ సినిమా కథను ముందుకు నడిపిస్తాయి. వినోదం, భావోద్వేగాలు సమపాళ్లలో ఉండేలా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

©️ VIL Media Pvt Ltd.