Reading Time: < 1 minute

మణిపూర్ లో మళ్ళీ మొదలైన అల్లర్లు : ఇళ్లకు నిప్పు, ఇంటర్నెట్ బంద్..

Caption of Image.

మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లాలో మళ్ళీ ఉద్రిక్తత పెరిగింది. మంగళవారం ఉదయం తంగ్ఖుల్ నాగా వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై దాడి జరగడంతో హింస మొదలైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీగా ఉన్న పాత ఇళ్లకు నిప్పు పెట్టడమే కాకుండా, విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం జిల్లాలో 5 రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేసి, కర్ఫ్యూ విధించింది.

ఎం జరిగిందంటే:
ఉఖ్రుల్, కామ్జోంగ్ జిల్లాల్లో కుకీ వర్గీయుల రాకపోకలపై నాగా సంస్థలు ఆంక్షలు విధించిన తరువాత రోజే ఈ దాడులు జరగడం ప్రారంభమయ్యాయి. సాయుధులు ఇళ్లను తగలబెట్టాగా..  దీనివల్ల వందలాది మంది గ్రామస్తులు భయంతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. కాల్పులను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు భద్రతా దళాలతో వాగ్వాదానికి దిగారు.  

ప్రజల వలసలు:
గత రెండు రోజులుగా కుకీ & తంగ్ఖుల్ నాగా గ్రామాలకు చెందిన మహిళలు, పిల్లలు, వృద్ధులు  ప్రాణాలను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాకు తరలి వెళ్లిపోతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో వీరు తలదాచుకుంటుండగా… ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అల్లర్లను ఆపడానికి ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించింది.
 

©️ VIL Media Pvt Ltd.