Reading Time: < 1 minute

హైదరాబాద్ గాజులరామారంలో భూ ప్రకంపనలు : ఇళ్ల నుంచి జనం పరుగులు

Caption of Image.

హైదరాబాద్ సిటీలోని కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారంలో భూ ప్రకంపనలు అంటూ జనం ఆందోళన చెందుతున్నారు. 2026, ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో.. భూమి కంపించింది అంటున్నారు స్థానికులు. భూకంపం వచ్చినట్లు భూమి కంపించిందని.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని అంటున్నారు స్థానికులు. కొన్ని సెకన్లు భూమి కంపించిదనే వాళ్లు చెబుతున్న వెర్షన్. నిజంగా భూమి కంపించిందా లేక చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాల వల్ల అలా అనిపించిందా అనేది విషయంపైనా క్లారిటీ లేదు.

 అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం..  కుత్బుల్లాపూర్ గాజులరామారం ఆదర్శనగర్‌లో ఉదయం 10 గంటల సమయంలో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. అకస్మాత్తుగా భూమి షేక్ అయినట్లు అనిపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాఠశాల నుంచి పిల్లలు  బయటకు వచ్చారు. 

 ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీడియోల్లో ఓ పాఠశాల నుంచి చిన్నపిల్లలు భయంతో తరగతుల నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ ఘటనలో ప్రస్తుతం ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని సమాచారం.అయితే భూమి కంపించడానికి గల కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భూ ప్రకంపనలా? లేక ఏమైనా పేలుళ్ల ప్రభావమా? అని తెలియాల్సి ఉంది. 

 

©️ VIL Media Pvt Ltd.