Reading Time: < 1 minute

ఎంఎస్ఎంఈలకు..సెక్యూరిటీ లేకుండా రూ.20 లక్షల వరకు లోన్

Caption of Image.

న్యూఢిల్లీ: ఎంఎస్​ఎంఈలకు ఊరటనిస్తూ ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న వ్యాపారాలకు ఇచ్చే హామీ లేని లోన్ల పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతూ మార్గదర్శకాలను సవరించింది.

ఎంఎస్ఈ రంగానికి రూ.20 లక్షల వరకు ఇచ్చే లోన్లకు బ్యాంకులు సెక్యూరిటీ అడగకూడదని ఆదేశించింది. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న యూనిట్లకు బ్యాంకులు తమ అంతర్గత విధానాల ప్రకారం ఈ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచుకోవచ్చు.

పీఎంఈజీపీ కింద ఇచ్చే లోన్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. పెంచిన ఈ కొత్త పరిమితులు 2026 ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి. దీనివల్ల ఆస్తుల హామీ ఇవ్వలేని చిన్న వ్యాపారులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది.
 

©️ VIL Media Pvt Ltd.