Reading Time: < 1 minute

పవన్ కళ్యాణ్ పెద్ద ఈగోయిస్ట్… తెలంగాణలో డిపాజిట్లు రావనే పర్యటన రద్దు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Caption of Image.

హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెద్ద ఈగోయిస్ట్ అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో జనసేనకు ప్రచారం చేసినా డిపాజిట్లు కూడా రావని తెలిసే పర్యటనని రద్దు చేసుకున్నాడని సెటైర్చేశారు. ‘పవన్ కల్యాణ్ కు ప్రొడ్యూసర్ చంద్రబాబు, కోప్రొ డ్యూసర్ లోకేష్, కొత్త ప్రొడ్యూసర్ మోదీ. 

కొండగట్టు ఆలయానికి టీటీడీ నుంచి డబ్బులిచ్చి.. పవన్ జేబులో నుంచి ఇచ్చిన ట్లు డప్పు కొట్టుకుంటున్నాడు. తెలంగాణ గురించి నోరు జారి మాట్లాడిండు. క్షమాప ణలు చెప్పమని అడిగినా చెప్పలేదు. తెలం గాణలో ఉన్న భూములు, నిధుల కోసమే ఆంధ్రా నాయకులు వస్తున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదు’ అని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.