Reading Time: < 1 minute

T 20 World CUP : ఇటలీపై 73 పరుగుల తేడాతో స్కాట్లాండ్ విక్టరీ

Caption of Image.

టీ 20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో.. ఇటలీని చిత్తు చేసి గెలిచింది స్కాట్లాండ్ టీం. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 207 పరుగులు చేసింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ జట్టు.. 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 73 పరుగుల తేడా విజయం సాధించి.. వరల్డ్ కప్ సిరీస్ లో బోణీ కొట్టింది స్కాట్లాండ్.

స్కాట్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. మైఖల్ లీస్క్ ఏకంగా 4 వికెట్లు తీసి.. ఇటలీ జట్టు నడ్డి విరిచాడు. నాలుగు ఓవర్లు వేసిన స్కాట్లాండ్ బౌలర్ మైఖల్ లీస్క్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 వికెట్లు తీయటం విశేషం. మార్క్ వాట్ 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ కుర్రీ, బ్రాడ్ వీల్, ఓలివర్ డేవిడ్ సన్ చెరో వికెట్ తీశారు. దీంతో ఇటలీ జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

టార్గెట్ ఛేజ్ కోసం బరిలోక దిగిన ఇటలీ జట్టు.. స్టార్టింగ్ నుంచి తడబడింది. ఓపెనర్ జస్టిన్ మక్కా డకౌట్ అవ్వటం.. మరో ఓపెనర్ ఆంటోనీ 13 పరుగులకే ఔట్ కావటంతో.. ఇటలీ కష్టాలు మొదలయ్యాయి. బెన్ మనెట్ 31 బంతుల్లో 52 పరుగులు చేసి.. ఇటలీ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత హ్యారీ మానెట్ 25 బాల్స్ కు 37 పరుగులు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. వీళ్లిద్దరే 89 పరుగులు చేశారు. చివరి ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజట్ కే ఔట్ కావటంతో.. 134 పరుగులకే ఆలౌట్ అయ్యి.. స్కాట్లాండ్ పై ఓడిపోయింది ఇటలీ జట్టు.

©️ VIL Media Pvt Ltd.