Reading Time: 2 minutes
Sudip Kumar Gharami: 31 ఫోర్లు, 6 సిక్సర్లతో రికార్డ్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే.. ఒక్క పరుగు తేడాతో చెత్త రికార్డ్..

Bengal vs Andhra, 3rd Quarter-Final: రంజీ ట్రోఫీ 3వ క్వార్టర్ ఫైనల్ లో ఓ విచిత్రమైన రికార్డ్ నమోదైంది. బెంగాళ్ ప్లేయర్ ఒక్క పరుగు తేడాతో ట్రిఫుల్ సెంచరీ కోల్పోయాడు. దీంతో ఇప్పటి వరకు రంజీ ట్రోఫీలో ఎవ్వరూ ఇలా 299 దగ్గర ఔట్ కాలే. పాపం తొలిసారి ఇలా ఓ ప్లేయర్ ట్రిఫుల్ సెంచరీ కోల్పోయి, చెత్త రికార్డ్ ను తనపేర లిఖించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగాల్ టాప్ ఆర్డర్ ప్లేయర్ సుదీప్ కుమార్ ఘరామి 299 పరుగుల వద్ద ఇలా విషాదకరంగా పెవిలియన్ చేరాడు.

అవాంఛిత రికార్డ్..

సుదీప్ కుమార్ ఘరామి 200 పరగుల వద్ద ఔట్ కావడంతో తన పేరుతో ఓ అవాంఛనీయ రికార్డ్ నమోదు చేసుకున్నాడు. రంజీ ట్రోఫీలో ఇలా ఔట్ అవ్వడం తొలిసారి. ఇంతకు ముందు శంతను సుగ్వేకర్ 299 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచాడు. 1988-89లో మహారాష్ట్ర బ్యాటర్ మధ్యప్రదేశ్ టీంపై 299 పరుగులు చేశాడు. ఈసారి సుదీప్ కుమార్ అదే స్కోర్ వద్ద ఔట్ అయి రికార్డ్ స‌ృష్టించాడు.

ట్రిఫుల్ సెంచరీ మిస్సయినా.. అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న సుదీప్..

రెండో రోజు క్రీజులోకి వచ్చిన సుదీప్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. రోజు ముగిసే సమయానికి 157 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇక మూడో రోజు మొత్తంగా 270 బంతుల్లో 150 పరుగులు సాధించాడు. అలాగే, 415 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతను 31 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.

సుదీప్ కుమార్ కెరీర్..

ఈ రంజీ ట్రోఫీ సీజన్ లో బెంగాల్ తరపున సుదీప్ కుమార్ ఘరామి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్ లలో 54.25 సగటుతో 651 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో ర2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, ఈ సీజన్ లో తొలి ట్రిఫుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డ్ కొద్దిలో మిస్సయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..