Reading Time: < 1 minute

HYD: పతంగి కోసం వెళ్లి..ప్రాణాలు పోగొట్టుకున్న పదేళ్ల బాలుడు

Caption of Image.

గ్రేటర్ హైదరాబాద్ విషాదం చోటుచేసుకుంది.  మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆడుకుంటూ పతంగి కోసం వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.  సాయిబాబా నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ పైకి ఎక్కిన హేమంత్ (10) అక్కడి నుంచి జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతుడు హేమంత్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన మహేందర్–సుజాత దంపతుల కుమారుడిగా గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న మైలర్ దేవ్ పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

©️ VIL Media Pvt Ltd.