
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక ప్రైవేట్ బ్యాంకులో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కస్టమర్ల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ఒక బ్యాంక్ ఉద్యోగిని.. అహంకారంతో ఊగిపోతూ చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. పంకీ ప్రాంతంలోని HDFC బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆస్థా సింగ్ అనే మహిళా బ్యాంక్ ఉద్యోగిని.. ఒక పురుష కస్టమర్‌తో వాగ్వాదానికి దిగింది. అంతే కాక ఈ క్రమంలో సహనం కోల్పోయి వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ అతడిని దూషించింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఆమె కోపంతో ఊగిపోతూ తన డెస్క్‌పై ఉన్న ల్యాప్‌టాప్‌ను కస్టమర్‌పైకి విసిరేస్తానన్నట్లుగా భయపెట్టింది. బ్యాంక్ లోపల అందరూ చూస్తుండగానే ఆమె రుబాబు బిహేవియర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
“Thakur hoon main, 🤡
bakchodi mat karna mere se.” 👹👹Astha Singh, an HDFC employee, flaunted her caste on the bank premises and tried to beat a customer without any shame.
This ‘Manu Ki Naatin’ has only merit of hate. HDFC must kick out this casteist clown now. pic.twitter.com/MVFND1m1y4
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) February 8, 2026
అయితే ఈ గొడవలో ఆమె చేసిన ఒక కామెంట్ వివాదాన్ని మరింతగా ప్రేరేపించింది. “నేను ఠాకూర్‌ని.. నాతో పెట్టుకోవద్దు” అంటూ ఆమె తన కులాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రొఫెషనల్ వర్కింగ్ ప్లేస్‌లో ఉండి కస్టమర్‌ను కులం పేరుతో బెదిరించడం ఏంటని జనం మండిపడుతున్నారు. కస్టమర్ సర్వీస్ అంటే కేవలం డబ్బులు జమ చేయడం.. విత్‌డ్రా చేయడం మాత్రమే కాదు, కనీస మర్యాద పాటించడం కూడా అని సోషల్ మీడియాలో నెటిజన్లు క్లాస్ తీసుకుంటున్నారు సదరు మహిళా ఉద్యోగిని బిహేవియర్ పై.
వైరల్ అయిన ఈ ఎక్స్ వీడియోకు చాలా మంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును ట్యాగ్ చేస్తూ కంప్లెయింట్ల వర్షం కురిపిస్తున్నారు. బ్యాంకుల్లో కనీస వర్క్ ఎథిక్స్ పోయాయా..? అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. “ఇలాంటి అహంకారపూరిత ఉద్యోగుల వల్ల బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుంది, తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోండి” అంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రైవేట్ బ్యాంకులో ఇంత బహిరంగంగా కుల అహంకారాన్ని ప్రదర్శించడం క్షమించరాని నేరమని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ వివాదంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు బ్యాంకింగ్ రంగంలో కస్టమర్లకు, సిబ్బందికి మధ్య ఉండాల్సిన వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చాలా మంది అంటున్నారు.