Reading Time: < 1 minute

ఫ్యామిలీస్‌‌ మెచ్చిన సుమతీ శతకం

Caption of Image.

అమర్‌‌‌‌దీప్ చౌదరి,  శైలి చౌదరి జంటగా  ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన చిత్రం ‘సుమతీ శతకం’. ఇటీవల విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌‌ తెలియజేసేందుకు ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. హీరో అమర్దీప్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులను మెప్పించేందుకు నాకు తెలిసిన ప్రతి విషయంలోను కష్టపడి పని చేశాను. అందుకు తగ్గ ఫ​లితం లభించడం సంతోషంగా ఉంది.  సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఒక్క ఛాన్స్  అని అడగ్గా, విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

మరింత మంచి సినిమాలతో మీ ముందుకు వస్తా’ అని చెప్పాడు.  ‘సినిమా చూసిన అందరూ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అని అంటున్నారు. యువతతో పాటు కుటుంబ సమేతంగా వచ్చి మా సినిమాను చూడడం ఆనందంగా  ఉంది” అని దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. హీరోయిన్ శైలి చౌదరి,  నటీనటులు మహేష్ విట్టా,  మలక్పేట్ శైలజమ్మ, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్,  రచయిత బండారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.