Reading Time: < 1 minute
కర్ణాటకలో కుప్పకూలిన చార్టర్డ్‌ ఫ్లైట్‌

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఒక చార్టర్డ్‌ ఫ్లైట్‌ కుప్పకూలింది. కలబురగి నుంచి బెళగాంకు వెళ్తున్న ఈ విమానం ఇంధనం అయిపోవడంతో పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని స్థానికులు, సహాయక బృందాలు వెంటనే గుర్తించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ఇంధన కొరత కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరింత దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్నాళ్లీ మంటలు.. భయపెడుతున్న అగ్నిప్రమాదాలు

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

ఇక 27 భాషల్లో యూట్యూబ్‌ వీడియోలు

పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు