Reading Time: < 1 minute

ఎఫ్డీసీ కొత్తగూడెం డీఎం అరెస్ట్..విశాఖలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్​డీసీ) కొత్తగూడెం డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఖమ్మం ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. జామాయిల్ తోటల హార్వెస్టింగ్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి రూ.28.80 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో మొదటి విడతగా రూ.3.51 లక్షలు తీసుకుంటున్న సమయంలో జనవరి 3న ప్లాంట్ మేనేజర్ రాజేందర్, గోపాల కృష్ణలను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న శ్రావణిని ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందడంతో నిఘా వేసి పట్టుకున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచారు.

©️ VIL Media Pvt Ltd.