Reading Time: < 1 minute

మైనారిటీ గురుకులాల్లో విజిలెన్స్ వ్యవస్థ ఎత్తివేయాలి : టీజీపీఏ ప్రెసిడెంట్ అజయ్ కుమార్

Caption of Image.
  •     టీజీపీఏ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ 

హైదరాబాద్, వెలుగు: మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్ ముదావత్ తావూరియా ఆత్మహత్యయత్నానికి కారణమైన విజిలెన్స్ వ్యవస్థను ఎత్తివేయాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. విజిలెన్స్ వ్యవస్థను మైనార్టీ గురుకులాల్లో ఏర్పాటు చేయడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నదని శనివారం ఆయన పత్రిక ప్రకటనలో తెలిపారు. 

గురుకుల వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలు కరెక్ట్ కావని చెప్పారు. ప్రిన్సిపాల్స్ పనితీరును మానిటరింగ్ చేసేందుకు ఒక రెగ్యులర్ అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.