Reading Time: < 1 minute

SKY వల్లే 161 దాకా: బెంబేలెత్తించిన USA బౌలింగ్.. మన బౌలర్లపైనే భారం

Caption of Image.

ముంబై: టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచులో అమెరికా బౌలర్లు ఆకట్టుకున్నారు. శనివారం (ఫిబ్రవరి 7) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో అంచనాలకు మించి రాణించారు. పసికూనే కదా అని లైట్ తీసుకున్న భారత్‎కు ఝలక్ ఇచ్చారు. 

ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచును రసవత్తరంగా మార్చారు. అమెరికా బౌలర్లు రాణించడంతో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (84) ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తిలక్ వర్మ 25, ఇషాన్ కిషన్ 20 పర్వాలేదనిపించారు. 

అభిషేక్ శర్మ, శివమ్ దూబే గోల్డెన్ డకౌట్ అయ్యి తీవ్ర నిరాశపర్చారు. అమెరికా బౌలర్లలో వాన్ షాల్క్విక్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టాడు. హర్మీత్ సింగ్ 2 తీయగా.. అలీ ఖాన్, మహమ్మద్ మోసిన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం అమెరికా 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 

©️ VIL Media Pvt Ltd.