
హారర్ సినిమాల్లో రక్తం, కేకలు, దయ్యాల అరుపులు కామన్‌గా కనిపిస్తాయి. కానీ ఆ హారర్‌కి ‘అమ్మ’ సెంటిమెంట్‌ను జోడించి, ఒక ఎమోషనల్ రైడ్‌లా మలిస్తే ఎలా ఉంటుందో చూపించే చిత్రమే ‘ఎర్రచీర’. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రం (2026 ఫిబ్రవరి 6న) థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తోంది.
కథేంటంటే:
దాసు (కమల్ కామరాజు), అవంతిక (కారుణ్య చౌదరి) ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే వీరి సంతోషకరమైన జీవితంలోకి ఆస్తి రూపంలో విలన్ ప్రవేశిస్తుంది. దాసు అమ్మమ్మ పార్వతి, ఆస్తిపై ఉన్న వ్యామోహంతో కడుపుతో ఉన్న అవంతికను అత్యంత పాశవికంగా హత్య చేస్తుంది.
అయితే తన బిడ్డను దక్కించుకోవాలనే బలమైన కోరిక, తనను చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే కసి అవంతికను ఆత్మగా మారుస్తాయి. ఆమె ఎర్రచీర కట్టుకుని ఆత్మలా తిరిగి వస్తుంది. మరి అవంతిక తన పగ తీర్చుకుందా? ఈ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ శివకుమార్ (సుమన్ బాబు) ఏం చేశాడు? ఆధ్యాత్మిక గురువు సరిపోక త్రికోటేశ్వరస్వామి (సుమన్ బాబు) ఈ ఆత్మను ఎలా శాంతింపజేశారు? అనేది వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు సుమన్ బాబు ఈ చిత్రాన్ని కేవలం దెయ్యం సినిమాగా కాకుండా.. హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ డ్రామాగా మలిచారు. ముఖ్యంగా తల్లి ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం వల్ల కథలో డ్రామా సహజంగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, హారర్ ఎలిమెంట్స్‌తో సాగగా.. సెకండాఫ్‌లో యాక్షన్.. ఆధ్యాత్మిక కోణం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్‌కు ఒక ‘హై’ ఇస్తుంది.
Also Read : శివాజీ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్..
సినిమాలో యూత్ కోసం పెట్టిన 36 ముద్దుల పాట ‘లిప్ కిస్ సాంగ్’ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైనా, అది కేవలం ఆకర్షణ కోసమే కాకుండా కథా గమనంలో భాగంగానే వస్తుందని దర్శకుడు నేర్పుగా నిరూపించారు. ఈ చిత్రంలో 20% యదార్థ సంఘటనలను జోడించడం వల్ల ప్రేక్షకులు కథకు చాలా త్వరగా కనెక్ట్ అవుతుండగా, ఒక హారర్ కోణంలో ‘మదర్ సెంటిమెంట్’ను ఎలివేట్ చేయడం సరికొత్త ప్రయోగంగా నిలిచింది.
ముఖ్యంగా ఇంటర్వెల్ వద్ద ఇచ్చే అనూహ్యమైన ట్విస్ట్, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్స్‌గా నిలిచాయి. ఇక సినిమా ముగింపులో అరకు నేపథ్యంలో రానున్న సీక్వెల్ ‘అంబిక’ (ఎర్రచీర-2) గురించి ఇచ్చిన హింట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని, క్యూరియాసిటీని పెంచుతోంది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
సుమన్ బాబు: ఈ సినిమాలో ఆయన హీరో మాత్రమే కాదు, దర్శకుడు కూడా. పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూనే, మరోవైపు స్వామీజీ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయన ద్విపాత్రాభినయం సినిమాకు మెయిన్ పిల్లర్.
కారుణ్య చౌదరి: అవంతిక పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేశారు. అమాయకపు ఇల్లాలుగా, ఆ తర్వాత పగతో రగిలిపోయే ఆత్మగా ఆమె నటన అద్భుతం.
బేబీ తేజస్విని: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలైన ఈ చిన్నారి తన క్యూట్ యాక్టింగ్‌తో అందరి మనసు గెలుచుకుంది.
ఇతర నటీనటులు: కమల్ కామరాజు తన పరిధి మేరకు ఆకట్టుకోగా.. అలీ, అన్నపూర్ణమ్మ తదితరులు కథను ముందుకు నడిపించారు.
🎬 ‘ErraCheera’ — A blend of mother sentiment, horror & action — hits theatres on October 24th! ❤️🔥
Starring Baby Sai Tejaswini (granddaughter of Rajendra Prasad) & directed by Suman Babu.
Certified 🔞 ‘A’ for its intense horror thrills!#ErraCheera #TeluguCinema #Horror… pic.twitter.com/7EZkInQXgp
— Suresh Kondeti (@santoshamsuresh) October 9, 2025
టెక్నికల్ వాల్యూస్:
హారర్ సినిమాలకు ప్రాణం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా తన సంగీతంతో థియేటర్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు. సినిమాటోగ్రఫీ, VFX హారర్ సీన్స్‌ను రియలిస్టిక్‌గా చూపించాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉండటం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఫైనల్గా.. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్, అదిరిపోయే హారర్ మలుపులు, హృదయాన్ని కదిలించే సెంటిమెంట్ కావాలనుకునే వారు ‘ఎర్రచీర’ను అస్సలు మిస్ అవ్వకండి మూవీ లవర్స్.
‘A’ సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.