
90s వెబ్ సిరీస్, కోర్ట్, దండోరా సినిమాలతో ఆకట్టుకున్న శివాజీ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమాను స్వయంగా శివాజీనే నిర్మించడం విశేషం.
సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, లయ భార్యాభర్తలుగా నటించారు. 90స్ వెబ్ సిరీస్‌లో శివాజీకి కొడుకుగా నటించిన యంగ్ ఆర్టిస్ట్ రోహన్ ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. ప్రిన్స్, అలీ, ధనరాజ్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది.
ALSO READ : ‘మిరాయ్’ నటుడు కన్నుమూత..
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి (ఫిబ్రవరి 7న) ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. 2 నిమిషాల 23 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ క్రైమ్, కామెడీ, సస్పెన్స్ అంశాలతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో శివాజీ పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ పాత్రలో కనిపించారు. నిజాయితీకి మారుపేరైన వ్యక్తిగా, తప్పును సమర్థించని మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు.
తన వల్ల కానీ, మరెవరి వల్ల కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో జీవించే వ్యక్తిగా శివాజీ పాత్రను చూపించారు. భార్య, పిల్లలే తన ప్రపంచంగా భావించే వ్యక్తి, వారి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిత్వం అతనిది.
ALSO READ : అలసిపోయా.. అందుకే అలా చెప్పా..
ట్రైలర్‌లో శివాజీ, లయ మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే కథ ముందుకు సాగేకొద్దీ, శివాజీ నిజాయితీ వెనుక దాగి ఉన్న క్రైమ్ కోణం ఉత్కంఠను రేపుతోంది. అంతేకాదు, లయ మరియు రోహన్ పాత్రల్లో కనిపించే క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
Between right and wrong, Between family and fear, A story unfolds.
Sampradayini Suppini Suddapoosani
Trailer is Here
A Win Original Film
Premieres Feb 12#SSS @ActorSivaji #Laya@sudheer1sreeram @ganeshbandla#Rohan #ActorAli @DhanrajOffl@prince_cecil #RithvikReddy…
— ETV Win (@etvwin) February 7, 2026
హిట్ కాంబో:
శివాజీ, లయ జంటకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి నటించిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం సినిమాలు సక్సెస్ సాధించడంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ చివరగా 2010లో ‘బ్రహ్మాలోకం టూ యమలోకం’ చిత్రంలో నటించారు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవ్వడంతో సినిమాపై కీరియాసిటీ పెరిగింది.
Smiles that say it all 🤩✨
Get ready for a perfect family entertainer packed with crime, comedy & thrills!#SampradayiniSuppiniSuddapoosani from Feb 12 !
A @etvwin original Production#SSS @ActorSivaji #Laya @sudheer1sreeram #Rohan #Actorali @DhanrajOffl @prince_cecil… pic.twitter.com/MEZnnjaCty
— Sivaji (@ActorSivaji) February 1, 2026