Reading Time: 2 minutes

Actor Sunil Thapa: ‘మిరాయ్’ నటుడు కన్నుమూత.. పీపుల్ మీడియా ఎమోషనల్ ట్వీట్

Caption of Image.

నేపాల్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మేరీ కోమ్ బయోపిక్‌లో కోచ్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ నేపాలి నటుడు సునీల్ థాపా 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కాఠ్మండులోని థాపథలిలో ఉన్న నార్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (2026 ఫిబ్రవరి 6న) ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. “ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఈసీజీ నిర్వహించగా, ఆయన మరణించినట్లు నిర్ధారణ అయింది” అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

సునీల్ థాపా సినీ ప్రస్థానం: నేపాలి సినీ పరిశ్రమలో విశేషమైన స్థానం సంపాదించుకున్న సునీల్ థాపా.. 40 ఏళ్ల కెరీర్లో లో 300కి పైగా సినిమాల్లోపు నటించాడు. నేపాలి సినీ ప్రేక్షకులకు ఆయన, ‘చినో’ చిత్రంలోని ‘రతే కైలా’ పాత్రతో ఇంటింటా పేరు సంపాదించారు. ఆ పాత్రతోనే నేపాలి సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న విలన్స్ లలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు.

ఇకపోతే, నేపాలీతో పాటుగా, బాలీవుడ్, భోజ్ పురి సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు పొందారు. హిందీలో ‘మేరీ కోమ్’, తెలుగులో ‘మిరాయ్’ మూవీలోనూ కనిపించారు. ఆయన మృతిపై సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

“ప్రముఖ కళాకారుడు మరియు నిజంగా గొప్ప మానవతావాది అయిన సునీల్ థాపా గారి మరణం పట్ల మేము తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాము. మిరాయితో ఆయన అనుబంధం స్వల్పకాలమే అయినప్పటికీ, ఆయన మా బృందం మొత్తంతో ఆత్మీయమైన మరియు గౌరవప్రదమైన బంధాన్ని పంచుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము”అని పీపుల్ మీడియా సంస్థ ఎమోషనల్ ట్వీట్ చేసింది. 

©️ VIL Media Pvt Ltd.