Reading Time: < 1 minute

అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంకు బీసీసీఐ క్యాష్ రివార్డ్.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

Caption of Image.

అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడ్డ టీం ఇండియా 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో బీసీసీఐ ఇండియా అండర్ 19 టీంకు నజరానా ప్రకటించింది. వరల్డ్ కప్ విన్నింగ్ టీంకు రూ. 7.5 కోట్ల నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ ఎలాంటి క్యాష్ ప్రైజ్ ఇవ్వకపోయినా.. బీసీసీఐ క్యాష్ రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.

హరారేలో అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచిన టీంకు రూ. 7.5 కోట్లు క్యాష్ రివార్డ్ ప్రకటించినట్లు తెలిపారు దేవజిత్ సైకియా. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ… అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన టీంను ప్రశంసించడానికి మాటలు చాలవని.. చాలా అద్భుతంగా ఆడారని అన్నారు. వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని అకార్చించారని… అతడు బ్యాట్  తో పరుగుల వర్షం కురిపించాడని అన్నారు.

►ALSO READ | తక్కువ స్కోర్ కే నెదర్లాండ్స్ ఆలౌట్.. పాక్ ముందు ఈజీ టార్గెట్..

మొత్తం టీం అద్భుతంగా ఆడారని.. అందుకే ఇంగ్లాండ్ పై 100 పరుగుల తేడాతో గెలుపొందామని అన్నారు. ఇది ఒక పెద్ద విజయమని… ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు కొత్త ట్యాలెంట్ ని స్వాగతించేందుకు బీసీసీఐ చేసిన కృషి ఫలించిందని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.