Reading Time: < 1 minute

Tharun Bhascker: ‘నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్’.. గాయపడ్డ సింహంలా తరుణ్ భాస్కర్

Caption of Image.

తరుణ్‌‌ భాస్కర్‌‌‌‌ హీరోగా కశ్యప్‌‌ శ్రీనివాస్‌‌ దర్శకత్వంలో ఓ యూనిక్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ రాబోతోంది. దర్శకుడు పవన్‌‌ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్  నిర్మిస్తున్నారు.  హ్యాష్‌‌ ట్యాగ్‌‌ జీపీఎస్‌‌ అంటూ గత కొద్దిరోజులుగా ఈ సినిమా టైటిల్‌‌పై క్యూరియాసిటీ పెంచిన మేకర్స్… ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్‌‌ను శుక్రవారం రివీల్ చేశారు. ‘నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్’ అనేది ట్యాగ్‌‌లైన్.  

రివాల్వర్, విమానం, అమెరికా జెండా, డొనాల్డ్ ట్రంప్‌‌ క్యారికేచర్,  నటరాజ కాంపస్ బాక్స్‌‌లతో కూడిన టైటిల్‌‌ పోస్టర్‌‌‌‌ చూస్తుంటే ఇదొక పొలిటికల్‌‌ సెటైర్‌‌‌‌ క్రైమ్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ అని అర్థమవుతోంది.  ఫిబ్రవరి 9న టీజర్‌‌‌‌ను విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్‌‌గా నటిస్తుండగా విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 సూర్య ప్రకాష్ జోస్యుల కథను అందిస్తున్న ఈ చిత్రానికి  విద్యా సాగర్ చింత సినిమాటోగ్రాఫర్.  స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నాడు.  పాట చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. 

©️ VIL Media Pvt Ltd.