Reading Time: < 1 minute

మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లోకి బీజేపీ అభ్యర్థి

Caption of Image.

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి సమక్షంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు బీజేపీ అభ్యర్థి దండు హంసవేణి సదానందం కాంగ్రెస్​లో చేరారు. శుక్రవారం సాయంత్రం రామకృష్ణాపూర్​రామాలయం ఏరియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థితోపాటు పలువురు లీడర్లు, కార్యకర్తలకు మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు వారు తెలిపారు. 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పార్వతి విజయ గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.