Reading Time: 2 minutes

Dimple Hayathi : డోస్ పెంచేసిన డస్కీ బ్యూటీ… డింపుల్ హయతి కిల్లింగ్ లుక్స్ వైరల్!

Caption of Image.

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘డస్కీ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్న  నటి డింపుల్ హయతి. కేవలం వెండితెరపైనే కాదు, సోషల్ మీడియాలోనూ తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫోటోషూట్ నెట్టింట మంటలు పుట్టిస్తోంది. స్టైలిష్ బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న డింపుల్, తన ‘కిల్లింగ్ లుక్స్’తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఆమె పర్ఫెక్ట్ ఫిజిక్, కాన్ఫిడెంట్ పోజులు చూసి నెటిజన్లు “బ్లాక్ బ్యూటీ”, “టాలీవుడ్ సెన్సేషన్” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

లైమ్‌లైట్‌లోకి తెచ్చిన ‘గద్దలకొండ గణేష్’

డింపుల్ హయతి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’. అందులో  ఐటెం సాంగ్‌లో ఆమె వేసిన స్టెప్పులు మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఆ పాటతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ ఆమె మెప్పించింది. మాస్ మహారాజా రవితేజ సరసన ‘ఖిలాడీ’  ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి ‘ సినిమాలలో కీలక పాత్ర పోషించి తన గ్లామర్ పవర్‌ను చూపించింది.  గోపీచంద్ నటించిన ‘రామబాణం’ చిత్రంలో ‘భైరవి’ అనే సంప్రదాయబద్ధమైన పాత్రలో నటించి, తాను నటనలోనూ మేటి అని నిరూపించుకుంది.

►ALSO READ | Raveena Ravi: మూడేళ్లుగా నరకం చూపిస్తున్నాడు.. నటి రవీనా రవి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

సోషల్ మీడియా క్వీన్

డింపుల్ హయతి ఫ్యాషన్ సెన్స్ చాలా విభిన్నంగా ఉంటుంది. వెస్ట్రన్ వేర్ అయినా, ట్రెడిషనల్ చీరకట్టు అయినా ఆమె మోసే విధానం అద్భుతం. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన ఫాలోవర్ల కోసం నిత్యం హాట్ ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటోంది. నటన, అందం, అభినయం కలగలిసిన ఈ భామ ముందుముందు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.