Reading Time: 2 minutes
Bigg Boss Srija: బిగ్‌బాస్ హౌస్‌లో నిజంగా జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన దమ్ము శ్రీజ

బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దమ్ము శ్రీజ ఒకరు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నానికి చెందిన ఆమె సాప్ట్ వేర్ జాబ్ ను వదిలిపెట్టి మరీ బిగ్ బాస్ లోకి వచ్చింది. మొదట అగ్నిపరీక్షలో సత్తా చాటిన ఆమె కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటల్లో శ్రీజ ను చూసి కచ్చితంగా ఫినాలే దాకా వస్తుందనుకున్నారు చాలా మంది. అయితే అదేమీ జరగలేదు. ఎవరూ ఊహించిన విధంగా ఐదో వారంలోనే ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ ఎలిమినేషన్ బిగ్ బాస్ ఆడియెన్స్ ను షాక్ కు గురిచేసింది. శ్రీజది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక భరణితో పాటు హౌస్ లోకి రీ ఎంంట్రీ ఇచ్చిన శ్రీజ కేవలం ఒక వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. కేవలం భరణిని కాపాడేందుకు శ్రీజను బలిచేశారన్న కామెంట్స్ వినిపించాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శ్రీజ ప్రస్తుతం పలు టీవీ షోల్లో సందడి చేస్తోంది. బిబీ జోడీ లోనూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తోంది. తాజాగా ఓ టాక్ షోకు హాజరైన ఈ బిగ్ బాస్ బ్యూటీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంది. అలాగే బిగ్ బాస్ షో గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ లో ట్రోల్స్ చేయడానికి సపరేట్ గా ఒక టీం ఉంటుందని అంటున్నారు? అది నిజమేనా అని యాంకర్ శ్రీజను అడుగుతుంది. దీనికి రిప్లైగా ‘ అవును బిగ్ బాస్ లో పీ ఆర్ టీం ఉంటుంది. వాళ్లు 24 గంటలు ఎక్కడ మిస్ అవ్వకుండా వాచ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని ట్రోల్ చేస్తారు. అది ఎపిసోడ్ కు హైలైట్ గా నిలుస్తుంది. ఇలా బయట వాళ్లు అక్కడ ఏదో జరిగిపోయింది అని అనుకుంటారు. బిగ్ బాస్ లో నిజంగా జరిగేది ఇదే’ అని చెప్పుకొచ్చింది శ్రీజ. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

బి గ్ బాస్ శ్రీజ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Srija Dammu (@srija_sweetiee)

 

View this post on Instagram

 

A post shared by RJ Chaitu 🎤 (@rjchaitu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.