
హరారే: అనుకున్నదే జరిగింది. 412 పరుగుల భారీ టార్గెట్ ఛేజింగ్లో ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. తొలి రెండు ఓవర్లు టీమిండియా బౌలర్లు ఒక్క పరుగు రానివ్వకుండా కట్టడి చేశారు. ఆ తర్వాత.. ఇంగ్లండ్ ఓపెనర్ జోసెఫ్ మూర్స్ నాలుగు ఫోర్లతో చెలరేగి స్పీడ్ పెంచినప్పటికీ ఆ జోరు కాసేపటికే ఆవిరైపోయింది.
టీమిండియా బౌలర్ ఆర్ఎస్ అంబ్రీష్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఓపెనర్ మూర్స్ 16 బంతుల్లో 17 పరుగులు చేసి నిరాశగా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్ దగ్గర నుంచి మూర్స్ ఫామ్ కోల్పోయాడు. బంగ్లాతో ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ మూర్స్ ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
ఆ తర్వాత న్యూజిలాండ్ మ్యాచ్లో 40 బంతుల్లో 20 పరుగులు, ఆస్ట్రేలియా మ్యాచ్లో 33 బంతుల్లో 25 పరుగులు, కీలకమైన ఫైనల్ మ్యాచ్లో 16 బంతుల్లో 17 పరుగులు. ఇలా ఈ ఇంగ్లండ్ ఓపెనర్ ఫామ్ కోల్పోవడం.. టీమిండియా 412 పరుగుల టార్గెట్ పెట్టడంతో ఇంగ్లండ్ బ్యాటర్లపై తీవ్రంగా ఒత్తిడి ఉంది.
ఇక.. మరో ఓపెనర్ బెన్ డాకిన్స్ కూడా చేతులెత్తేస్తే ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో గెలవడం దాదాపు కష్టమే. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. బెన్ డాకిన్స్ 21 బంతుల్లో 25 పరుగులు, బెన్ మేయెస్ ఏడు బంతుల్లో రెండు పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.
Just the start India needed! 🔥#AmbrishRaghuvanshi provides the first breakthrough for India in the Final! 🇮🇳🙌
FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/EOBePwOQTG
— Star Sports (@StarSportsIndia) February 6, 2026