Reading Time: < 1 minute

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్యాన్సర్ ను తరిమేద్దాం : మంత్రి పొన్నం ప్రభాకర్

Caption of Image.

హుస్నాబాద్, వెలుగు: క్యాన్సర్ మహమ్మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందని, ఆ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్  పిలుపునిచ్చారు.

ప్రపంచ క్యాన్సర్  వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నం సత్తయ్య చారిటబుల్  ట్రస్ట్  ద్వారా హుస్నాబాద్  నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు స్టీల్  గ్లాసులు, ప్లేట్లు, ఇతర వస్తువులను పంపిణీ చేశామని తెలిపారు. మహిళల ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా, ఆరోగ్యవంతమైన సమాజంగా హుస్నాబాద్  నిలవాలని ఆకాంక్షించారు. 

©️ VIL Media Pvt Ltd.