Reading Time: < 1 minute

గురువారం దిగొచ్చిన గోల్డ్.. వెండి కేజీకి రూ.20వేలు తగ్గింది.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే

Caption of Image.

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మెల్లగా మెత్తబడుతున్న వేళ బంగారం, వెండి కొంత తగ్గి ఊరటను ఇస్తున్నాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ భారీగానే కొనసాగుతున్న నేపథ్యంలో రేట్లు ఊహించిన స్థాయిలో తగ్గటం లేదు. దీంతో ఒకరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ విలువైన లోహాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలోని రేట్లను గమనించటం చాలా ముఖ్యం.

ఫిబ్రవరి 5న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో ఫిబ్రవరి 4 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.502 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.15వేల 442గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 155గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.

ALSO READ : జాబ్ పోయిందా..? పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బు ఒకేసారి తీసుకోవచ్చో తెలుసా..?

ఇక వెండి రేట్లు వరుస పతనం నుంచి తిరిగి పుంజుకున్నప్పటికీ నేడు తిరిగి తగ్గింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొన్ని రోజుల కిందటి వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. కానీ గురువారం ఫిబ్రవరి 5, 2025న వెండి రేటు కేజీకి రూ.20వేలు తగ్గింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.20వేలు తగ్గి రూ.3లక్షలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది. 

©️ VIL Media Pvt Ltd.