Reading Time: < 1 minute

మూసిన తలుపుల వెనుక న్యాయం ఏడుస్తోంది: SIR పై సుప్రీంలో మమతా బెనర్జీ వాదనలు

Caption of Image.

ఢిల్లీ:పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో గళం విప్పారు. ఓటర్ల జాబితాలపై చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సీజేఐ సూర్యకాంత్ చాంబర్ కు హాజరైన మమతా, ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మూసిన తలుపుల వెనుక న్యాయం ఏడుస్తోంది” అంటూ కోర్టులో గట్టిగా వ్యాఖ్యానించారు.

 తనవాదనలు వినిపించేందుకు ఐదు నిమిషాలు కావాలని కోరగా, సీజేఐ 15 నిమిషాల సమయం ఇచ్చారు. ఈసీ తన విజ్ఞప్తులను పూర్తిగా పట్టించుకోవడం లేదని మమత ఆరోపించారు. “నాకు చివరికి ఎక్కడా న్యాయం దక్కడం లేదు. ఈసీకి ఆరు సార్లు లేఖలు రాశాను. ఒక్క సమాధానం కూడా లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆమె వాదనలు ఈసీపై నేరుగా దాడిగా మారాయి. 

మమతా పిటిషన్ ను గంభీరంగా పరిగణించిన ధర్మాసనం ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని భరోసా ఇచ్చింది. అదే సమయంలో ఆమె పిటిషన్ పై ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను సోమవారానికి (ఫిబ్రవరి 09) వాయిదా వేసింది.

©️ VIL Media Pvt Ltd.