
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ పరిధిలో ఈ మధ్య యువత వింత పోకడలకు అలవాటు పడుతున్నారు. రోజంతా ఎలా ఉన్నా రాత్రయితే చాలు ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్లపైనే చక్కర్లు కొడుతూ మిగతా వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ అరాచక ప్రవృత్తి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ రోడ్లపై కనిపిస్తోంది. ఇటీవలే హైటెక్ సిటీలో ఓ ఆటో డ్రైవర్ సైతం ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఏకంగా పోలీసుల వాహనాన్నే అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. పెద్దఎత్తున యువత రోడ్లపైకి చేరిపోయి ఫుల్లుగా మద్యం తాగేసి బైకులతో విన్యాసాలు ప్రదర్శిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. బైక్ ముందు టైర్‌ను గాల్లోకి లేపుతూ సినిమాల్లో హీరోల్లా ఫీలయిపోతున్నారు. ఇది వారి వయసు రీత్యా సరదాగానే ఉంటున్నప్పటికీ, ఏ మాత్రం అదుపుతప్పినా పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఊహించలేం.. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయనేది నిజం. అయితే.. ఇదంతా పట్టని యువత మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అదే వారికి ఆనందం అన్నట్లు సరదాలకి పోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :