Reading Time: < 1 minute

ఐడియా అదిరింది సారూ.. యాక్సిడెంట్ వార్నింగ్ బోర్డులు.. ప్రమాదానికి గురైన వాహనాలతోనే..

Caption of Image.

అతివేగం హానికరం.. ప్రమాదాలు జరిగే స్థలం.. ఇలాంటి బోర్డులు హైవేలపైన ఎన్ని పెట్టినా యాక్సిడెంట్లు మాత్రం తగ్గడం లేదు. ప్రమాదాల నివారణ కోసం.. డైవర్ల ఆలోచనను మార్చేందుకు పోలీసులు చేసిన వినూత్న ఆలోచన ఆకట్టుకుంటోంది. యాక్సిడెంట్ కు గురైన వాహనాలనే ప్రమాదనివారణ చిహ్నాలకు వాడటం ఆలోచింపజేస్తోంది.

ఆదిలాబాద్   జిల్లా నేరడిగోండ జాతీయ రహదారిపై  ప్రమాదాల‌ నియంత్రణకు  పోలీసుల వినూత్న  అలోచన చేశారు. ప్రమాదాలకు గురైనా కార్లనే ప్రమాదాల నివారణకు హెచ్చరికల చిహ్నలుగా ఏర్పాటు చేశారు. కుప్టిఘాట్ లో ఏర్పాటు చేసిన హెచ్చరికల చిహ్నన్ని బుధవారం (ఫిబ్రవరి 04)  ప్రారంభించారు ఎస్పీ ఆఖిల్ మహజన్.

జాతీయ రహదారిపై ప్రమదాలను హెచ్చరించేలా  ప్రమాదానికి గురైన  కారును ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహజన్ చెప్పారు. వేగం కన్నా ప్రాణమిన్న..  ప్రాణం విలువ తెలపడానికి  ప్రమాదానికి గురైనా కారు చిహ్నన్ని  ఏర్పాటు చేశామని  తెలిపారు.  వేగం  తగ్గించుకుని.. ప్రాణాలు  రక్షించుకోవాలని  వాహనదారులకు పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.