Reading Time: < 1 minute
ఒకే రోజు రిలీజ్‌ కానున్న టాక్సిక్, ధురంధర్ వీడియో

మార్చి 19న సిల్వర్‌ స్క్రీన్‌పై రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి విడుదలై బిగ్‌ ఫైట్‌కు సిద్ధమవుతున్నాయి. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన దురందర్ సీక్వెల్‌తో పాటు, కేజీఎఫ్‌ తర్వాత యశ్ నటించిన టాక్సిక్ చిత్రం ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ పోటీలో ఏ సినిమా హాట్‌ ఫేవరెట్‌గా నిలుస్తుందో అనే చర్చలు జరుగుతున్నాయి. దురందర్ తొలి భాగం ఓటీటీ రిలీజ్ తర్వాత కొత్త చర్చ మొదలైంది. థియేటర్లలో కేవలం హిందీలో విడుదలైన దురందర్, ఓటీటీలో మాత్రం ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చి అద్భుతమైన స్పందన పొందింది. దీంతో దురందర్ 2పై ప్రాంతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కంటెంట్ పరంగా దురందర్‌కు ఎక్కువ రీచ్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో