Reading Time: 2 minutes

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ఫ్యాన్స్‌ అలర్ట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Caption of Image.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌’. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ నుంచి భారీ అప్డేట్ వచ్చింది.

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 26, 2026న ప్రేక్షకుల ముందుకు రానుందని స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

ALSO READ : బరితెగించిన ఫేక్ ఐడీ రాయుళ్లు.. 

ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘పవర్ స్టార్ అభిమానులకు గ్రాండ్ సెలబ్రేషన్‌కు సమయం దగ్గరపడుతోంది. మన ఉస్తాద్‌ను ఘనంగా ఆహ్వానించేందుకు కేరింతలు, ఈలలు, హంగామాకు సిద్ధమవ్వండి! పవర్ స్టార్ మరియు కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికతో బాక్సాఫీస్ అగ్నిజ్వాలలా మండిపోనుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26, 2026న ఘనంగా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించనుంది’’ అని ట్వీట్ చేసింది.

ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది. మరి ఈసారి పవన్–హరీష్ కాంబో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అన్నది చూడాలి. అయితే, పెద్ది రిలీజ్ డేట్ మార్చుకోవడంతో, అదే ఆ రోజున పవన్ కళ్యాణ్ వస్తుండటం విశేషం. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ALSO READ : అఫీషియల్.. ఓటీటీలోకి మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’

©️ VIL Media Pvt Ltd.