Reading Time: < 1 minute

బాంబే ఐఐటీలో బీటెక్ స్టూడెంట్.. ఏం కష్టం వచ్చిందో ఏమో పాపం.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకి చనిపోయాడు..

Caption of Image.

బాంబే ఐఐటీ కాలేజీలో ఓ విద్యార్ధి తొమ్మిదవ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఐఐటీ కాలేజీల్లో పరిస్థితులపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.  బుధవారం ( ఫిబ్రవరి 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న నమన్ అగర్వాల్ ఇవాళ అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కాలేజీ బిల్డింగ్ 9వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో కాలేజీ స్టూడెంట్స్, స్టాఫ్ ఉల్లిక్కిపడ్డారు.

నమన్ అగర్వాల్ ఆత్మహత్యకు కాలేజీ హాస్టల్ నిర్వహణలో లోపాలు, యాజమాన్యం నిర్ణయాలే కారణమని… యాజమాన్యం నిర్ణయాలు స్టూడెంట్స్ ను మానసిక ఒత్తిడికి, డిప్రెషన్ కి గురి చేసేలా ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఈ ఘటన కారణంగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన  ప్రొఫెసర్ సన్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను రద్దు చేసింది కాలేజీ మేనేజ్మెంట్.

►ALSO READ | లూడో గేమ్ అనుకున్నా.. డెత్ గేమ్ అనుకోలేదు: ముగ్గురు పిల్లల తండ్రి

నమన్ అగర్వాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మేనేజ్మెంట్. నమన్ అకాల మరణం దిగ్బ్రాంతికి గురి చేసిందని.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధి ఇలా అర్థాంతరంగా మరణించడం చాలా దురదృష్టకరమని పేర్కొంది. అతని మరణం క్యాంపస్ లోని ప్రతి ఒక్కరిని బాధపెట్టిందని.. నమన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామంటూ ప్రెస్ నోట్ లో తెలిపింది కాలేజీ మేనేజ్మెంట్.

©️ VIL Media Pvt Ltd.