Reading Time: < 1 minute

వ్యాపారుల కోసం బిల్డ్ అప్లికేషన్లను కోరిన బోయింగ్

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: విమానాల తయారీ సంస్థ బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్‌‌షిప్ డెవలప్‌‌మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ ఐదో ఎడిషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ విద్యార్థులు, వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే దీని ఉద్దేశం. 2019లో ప్రారంభమైన బిల్డ్​ ద్వారా ఇప్పటికే వేలాది మంది గ్రాడ్యుయేట్లు, స్టార్టప్‌‌లు ప్రయోజనం పొందాయి.

 ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్నాలజీ, సస్టైనబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాల్లో వినూత్న ఆలోచనలు ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు.  విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేయడానికి రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందజేస్తామని బోయింగ్​ తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.