Reading Time: < 1 minute

ఇవాళ కడియం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ : స్పీకర్ గడ్డం ప్రసాద్

Caption of Image.
  •     పిటిషనర్ కేపీ వివేకానందకూ నోటీసు

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బుధవారం విచారణకు హాజరు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన కడియంపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్​పై స్పీకర్ ఈ నోటీసును జారీ చేశారు. 

బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని ట్రిబ్యునల్ ఆఫీసులో జరగనున్న ఈ విచారణకు హాజరుకావాల్సిందిగా కడియంతో పాటు పిటిషనర్ అయిన వివేకానందను స్పీకర్ ఆదేశించారు. కడియంకు స్పీకర్ నోటీసు ఇవ్వడంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం పది మందిలో.. ఏడుగురికి క్లీన్‌‌ చిట్ ఇవ్వగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌‌పై తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఇక దానం నాగేందర్ పై విచారణ కొనసాగుతోంది. 

©️ VIL Media Pvt Ltd.