Reading Time: < 1 minute

WPL 2026: ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ..

Caption of Image.

మహిళల ప్రీమియర్ లీగ్ 2026  ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. గుజరాత్ పై గెలిచి ఫైనల్ కు చేరుకుంది. సెమీస్ లో గుజరాత్ ను మట్టి కరిపించిన ఢిల్లీ ..  ఫిబ్రవరి 5న బెంగళూర్ (ఆర్సీబీ)తో ఫైనల్ లో తలపడనుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. గుజరాత్ ఇచ్చిన 169 రన్స్ టార్గెట్ ను కేవలం 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఢిల్లీ. లిజెల్లీ లీ 43 రన్స్ (24 బాల్స్ లో), జెమీమా రోడ్రిగ్జ్ 41 రన్స్ (23 బందులలో) తో చెలరేగడంతో WPL 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించారు. షెఫాలీ వర్మ 21 బంతులలో 31, వాల్వార్ట్ 24 బాల్స్ లో 32 మెరుపు ఇన్నింగ్స్ తో ఢిల్లీ చాలా ఈజీగా గెలుపును ముద్దాడింది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. బెత్ మూనీ అద్భుత హాఫ్ సెంచరీ (51 బాల్స్ లో 62 నాటౌట్) తో గుజరాత్ 168 రన్స్ చేయగలిగింది. జార్జియా వరేహమ్ 35 రన్స్ తో మూనీకి మంచి సహకారం అందించింది. 

©️ VIL Media Pvt Ltd.