
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. అయితే, ఇన్నాళ్లు ఈ స్పై థ్రిల్లర్.. బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సినీ ఆడియన్స్ ఉన్న ప్రతిచోటా ‘ధురంధర్’ పేరు వినిపిస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినీ వర్గాలతో పాటుగా నెటిజన్లు మరియు రాజకీయ వర్గాల్లోనూ ‘ధురంధర్’ క్రేజీ టాక్గా నిలిచింది. ఇంతకీ ‘ధురంధర్’ వైరల్ అవ్వడానికి కారణం ఏంటో చూద్దాం..
‘ధురంధర్’ లో ‘రాహుల్ గాంధీ’!
రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ విడుదలైంది. డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ‘రాహుల్ గాంధీ’ అనే పేరు కనిపించింది. దీంతో పలువురు నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. రాజకీయ రంగంలో ప్రముఖుడైన కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరు కావడంతో.. ఆయనకు ఈ సినిమాతో సంబంధం ఉందా? అనే సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అనేక చర్చలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సోషల్ మీడియాలో వైరల్..
‘ధురంధర్’ ట్రైలర్, సినిమా క్రెడిట్స్ స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ పలువురు X (ట్విట్టర్) యూజర్లు పోస్టులు చేశారు. ఒకరు, “నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ చూస్తే రాహుల్ గాంధీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని కనిపించింది. ఆశ్చర్యపోయాను” అంటూ రాసారు. మరికొందరు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టారు.
Watched Dhurandhar once again on Netflix just to find out that Rahul Gandhi is executive producer of this movie.
Always knew Rahul Gandhi is the biggest nationalist, man just believe in keep quiet and let work speak. pic.twitter.com/NzXAPjrWsv
— EngiNerd. (@mainbhiengineer) January 31, 2026
“రాహుల్ గాంధీ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని తెలుసుకోవడం కోసమే ధురంధర్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో మరోసారి చూశాను. రాహుల్ గాంధీ ఒక గొప్ప జాతీయవాది అని నాకు ఎప్పుడూ తెలుసు, ఆయన నిశ్శబ్దంగా ఉండి తన పనితోనే సమాధానం చెబుతారని నమ్ముతారు.” అని అన్నారు.
Zoom in to see who is the Executive Producer of Dhurandhar 😉😉
Amazing Coincidence na 💀💀 pic.twitter.com/lSUx3h9aPo
— Sameer (@BesuraTaansane) January 31, 2026
ఫ్యాక్ట్ చెక్: అసలు నిజం ఏమిటంటే..
ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేయగా, సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా క్రెడిట్ పొందిన రాహుల్ గాంధీ రాజకీయ నేత కాదని స్పష్టమైంది. ఆయన పేరు ఒకేలా ఉన్నా, ఇది పూర్తిగా వేరే వ్యక్తి. ఈ రాహుల్ గాంధీ సినిమా రంగంలో అనుభవం ఉన్న నిర్మాత. ఇప్పటికే ఆయన రుస్తుం, ది ఫ్యామిలీ మ్యాన్, రాకెట్ బాయ్స్, లక్కీ భాస్కర్ వంటి లాంటి పాపులర్ ప్రాజెక్ట్స్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు.
An executive producer in the film industry oversees financing, high-level decisions, and resources, often without daily creative involvement.
The politician Rahul Gandhi is not involved in films. The “Rahul Gandhi” credited as executive producer in Dhurandhar (2025) is a…
— Grok (@grok) January 31, 2026
AI కూడా క్లారిటీ ఇచ్చింది
ఈ విషయాన్ని AI చాట్‌బాట్ Grok కూడా Xలో స్పష్టం చేసింది. “ధురంధర్‌లో క్రెడిట్ పొందిన రాహుల్ గాంధీ రాజకీయ నేత కాదు. ఇది పేరు మాత్రమే ఒకేలా ఉన్న సినిమా ప్రొడ్యూసర్. IMDb, Times of India వంటి పాపులర్ నివేదికలు ఇదే విషయాన్ని క్లారిటీ ఇచ్చాయి. ” అని AI తెలిపింది.
అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాహుల్ గాంధీ పాత్ర గురించి వివరిస్తూ, “వారు సినిమా ఫైనాన్సింగ్, కీలక నిర్ణయాలు, ఫైనాన్షియల్ నిర్వహణ వంటి బాధ్యతలు చూస్తారు. రోజువారీ క్రియేటివ్ పనుల్లో పాల్గొనకపోవచ్చు” అని తెలిపింది.
లో ప్రొఫైల్ నిర్మాత..
రాజకీయ నేతతో పేరు కలిసివచ్చినా, ఈ రాహుల్ గాంధీ మాత్రం తన పని ద్వారా మాత్రమే గుర్తింపు పొందే లో ప్రొఫైల్ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్స్‌కు మద్దతు ఇవ్వడమే ఆయన ప్రత్యేకత. మొత్తానికి, ‘ధురంధర్’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కనిపించిన రాహుల్ గాంధీ పేరు రాజకీయాలకు సంబంధించినది కాదని క్లారిటీ వచ్చింది.
An epic welcome for an epic saga. Dhurandhar is trending at #1 in India 🔥⚔️#DhurandharOnNetflix pic.twitter.com/nq5mkAUKrC
— Netflix India (@NetflixIndia) February 1, 2026