
Pakistan Cricket Team: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులు ముగిసే సూచనలు కనిపించడం లేదు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడటానికి పాకిస్తాన్ మొదట నిరాకరించిన సంతగి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం షరతులు విధించిందని నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ను తిరిగి చేర్చుకుంటేనే పాకిస్తాన్ జట్టు భారత్‌తో ఆడుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగాల్సి ఉంది. కానీ పీసీబీ ఆ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది.
ఐసీసీ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ..
బంగ్లాదేశ్ జట్టు తన అన్ని మ్యాచ్‌లను భారతదేశం నుంచి శ్రీలంకకు మార్చాలని అకస్మాత్తుగా డిమాండ్ చేయడంతో ఐసీసీ ఆ జట్టును టీ20 ప్రపంచ కప్ నుంచి మినహాయించింది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించినందున బీసీబీ ఈ ఆకస్మిక డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ అంగీకరించలేదు. ఈ అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు, బీసీబీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ, బీసీబీ తన డిమాండ్‌పై దృఢంగా ఉండిపోయింది. చివరికి ఐసీసీ దాన్ని మినహాయించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది.
పాకిస్తాన్ రాజకీయాలు..
BIG ANNOUNCEMENT BY PCB
Pakistan will only consider calling off the boycott and will only play against India on 15th if the ICC brings Bangladesh back into the World Cup. (Qadir Khawaja) pic.twitter.com/bXjF3ds66Q
— 𝐀. (@was_abdd) February 2, 2026
బంగ్లాదేశ్ జట్టు ఓటమి తర్వాత, పాకిస్తాన్ ఈ అంశాన్ని రాజకీయం చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని పీసీబీ తన ప్రభుత్వంతో చర్చించి, చివరికి పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని, కానీ భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. పాకిస్తాన్ చర్య తర్వాత, ఐసీసీ ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పాకిస్తాన్‌కు ఈ విషయం తెలుసు. పీసీబీ త్వరలో ఈ అంశంపై యూ-టర్న్ తీసుకోవచ్చని భావిస్తున్నారు.
BIG ANNOUNCEMENT BY PCB