Reading Time: < 1 minute

జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డు

Caption of Image.

హైదరాబాద్: రావినారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు 2025 ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సోమవారం (ఫిబ్రవరి 2) సాయంత్రం జూబ్లీహిల్స్ లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో  సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి .. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి అవార్డును ప్రదానం చేశారు. 2025 సంవత్సరానికి గాను రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డును జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డికి ఇవ్వాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ నిర్ణయించింది.

©️ VIL Media Pvt Ltd.