Reading Time: < 1 minute

క్లాసురూంలో పాఠాలు చెబుతూ..గుండెపోటుతో లెక్చరర్ మృతి

Caption of Image.

హనుమకొండ జిల్లాలో విషాద ఘటన. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే గుండెపోటుతో కుప్పకూలి లెక్చరర్ మృతిచెందడడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల ఓ బస్సు డ్రైవర్ డ్రైవింగ్  చేస్తూనే  హార్ట్ అటాక్ తో చనిపోయిన ఘటన మరువక ముందే ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున నన్నబోయిన శ్రీశైలం గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం (ఫిబ్రవరి2) ఉదయం క్లాసు రూంలో విద్యార్థులకు హాజరు తీసుకొని పాఠాలు ప్రారంభించగానే ఒక్కసారిగా శ్రీశైలం గుండెపోటుకు గురై కూప్పకూలినట్టు విద్యార్థులు తెలిపారు.  

విషయం తెలుసుకున్న  తోటి లెర్చరర్లు,  కాలేజీ సిబ్బంది చికిత్స కోసం శ్రీశైలం ను హనుమకొండలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే   శ్రీశైలం మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. 

లెక్చరర్ శ్రీశైలానికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబ పెద్ద ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అటు కళాశాలలోనూ విషాద ఛాయలు అలముకొన్నాయి. 

©️ VIL Media Pvt Ltd.