Reading Time: < 1 minute

గర్భసంచిలో 2.7 కిలోల కణతి.. తొలగించిన బర్త్‌‌‌‌ రైట్ బై రెయిన్‌‌‌‌ బో హాస్పిటల్ డాక్టర్లు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: నానక్‌‌‌‌ రామ్‌‌‌‌ గూడలోని బర్త్‌‌‌‌ రైట్ బై రెయిన్‌‌‌‌ బో హాస్పిటల్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. గర్భసంచిలో ఏకంగా 2.7 కిలోల బరువున్న 11 ఫైబ్రాయిడ్స్‌‌‌‌ (కణతి)తో బాధపడుతున్న 26 ఏండ్ల యువతికి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస బద్వేలి నేతృత్వంలోని బృందం విజయవంతంగా లాపరోస్కోపిక్ సర్జరీ చేసింది. కర్బూజా, బత్తాయి పండు సైజులో పెరిగిపోయిన ఈ కణితల వల్ల సదరు యువతి చూడటానికి 8 నెలల గర్భవతిలా కనిపించేది. 

ఇతర హాస్పిటల్స్ లో ఓపెన్ సర్జరీ తప్పదని చెప్పినా.. బర్త్‌‌‌‌ రైట్ డాక్టర్లు అత్యంత నైపుణ్యంతో అడ్వాన్స్‌‌‌‌డ్ లాపరోస్కోపిక్ విధానంలోనే వాటిని తొలగించారు. భవిష్యత్తులో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం దెబ్బతినకుండా గర్భాశయాన్ని సంరక్షిస్తూ ఈ సంక్లిష్ట ఆపరేషన్ చేయడం విశేషం. ఈ విధానం వల్ల కోత చిన్నగా ఉండటంతో పాటు నొప్పి తక్కువగా ఉంటుందని, పేషెంట్ త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ మానస తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.