
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. రూపాయి బలహీనత ప్రభావవం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. వారం రోజుల్లోనే బంగారం ధర దాదాపు 4వేల వరకు పెరిగింది. అయితే.. అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా.. పెరుగుతుండటంతో.. దేశీయంగా కూడా పెరుగుతున్నాయని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. బుధవారం (డిసెంబర్ 24 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 మేర పెరిగి.. రూ.1,38,930 గా ఉంది.
22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.350 మేర పెరిగి.. 1,27,350 గా ఉంది.
వెండి కిలో ధర రూ.10వేల మేర పెరిగి.. 2,33,000 గా ఉంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,930, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,27,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,000 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,38,930, 22 క్యారెట్ల ధర రూ.1,27,350 ఉంది. కిలో వెండి ధర రూ.1,44,000 ఉంది.