
ఇటీవల జరిగిన ‘మెగా యూత్ ఫోర్స్’ ఈవెంట్‌లో అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన తన రోజువారీ క్రమశిక్షణ, సమయం విలువ, అభిమానులతో తన అనుబంధం వంటి అనేక విషయాలను పంచుకున్నారు. 47 సంవత్సరాలకు పైగా నన్ను ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, అభిమానిస్తూ మీ తల్లిదండ్రులు, మీరు, మీ బిడ్డలు.. ఈ ప్రేమ, ఈ అనుబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి నా సోదరులకు, నా బ్లడ్ బ్రదర్స్ కు, బ్లడ్ సిస్టర్స్ కు నా హృదయపూర్వక స్వాగతం. ఎందుకంటే, ఎవరో ఒకళ్ళు హానెస్టీ తోటి, సిన్సియర్ గా మన మధ్య ఒక రకమైనటువంటి దూరం కలుగుతుంది.. ఒకటి నా సినిమాల బిజీయో, నేను ఇతర వ్యాపకాలతోటో మిమ్మల్ని కలవాలన్నా, మన ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అది ఉండే కొలది, రోజు రోజుకి, సంవత్సరం సంవత్సరానికి.. అది బలోపేతం అవుతూ ఉండేదే తప్ప, తరిగేది కానే కాదు. అలాంటి దృఢమైనటువంటి గట్టి అనుబంధం మీ మధ్య, నా మధ్య ఉంది.
నా ప్రేక్షకులు లేకపోయి ఉంటే గనుక, ఇంకా వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇంత వయసు వచ్చినా.. “ఇంకా వాళ్ళు నువ్వు ఎప్పుడు డాన్స్ చేస్తూనే ఉండాలి, మమ్మల్ని కామెడీ చేసి అలరిస్తూనే ఉండాలి, ఫైట్ చేసి వాళ్ళను ఉద్వేగభరితులను చేయాలి” అంటూ మొన్నటి సంక్రాంతి మన ‘శంకర వరప్రసాద్’ వరకు కూడా మీరు నన్ను అంత ఆదరించారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఆనాటి చిరంజీవి లాగానే.. మీ నాన్నగారు వాళ్ళు, మీ అమ్మగారు వాళ్ళు అభిమానిస్తున్నట్లుగానే, ఇప్పటికి మీరు అభిమానిస్తున్నారు, మీ పిల్లల చేత కూడా అభిమానం కనపరుస్తున్నారు అంటే నాకు నిజంగానే.. అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు. అది మీరు ఇచ్చిన స్ఫూర్తి, అది మీరు నాకు చూపిస్తున్న ప్రేమ. ఇదే నాకు బలం, ఇదే నాకు ఎనర్జీ. అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి, అలాంటి విండోస్ వాళ్ళు డిజైన్ చేయడానికి నేను దోహద పడిందేమో అనుకుంటున్నాను. కాబట్టి దానికి సర్వదా ఎప్పుడూ మీకు అందరికీ కృతజ్ఞతలు అని ఆయన అన్నారు.