July 23, 2026

Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..

Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
Reading Time: < 1 minute
Shikhar Dhawan Neet Paper Leak Backlash

Shikhar Dhawan: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తోంది. యువత ఈ ఉద్యమంలో పాల్గొంటోంది. ఈ ఉద్యమానికి పలువరు సెలబ్రెటీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇదిలా ఉంటే, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు మాత్రం ట్రోలింగ్‌కు గురవుతోంది. తన పోస్టులో చేసిన కొన్ని వ్యాఖ్యలపై విద్యార్థులు అతడిని విమర్శిస్తున్నారు. ఓపికగా ఉండి, ప్రభుత్వాన్ని విశ్వసించాలని శిఖర్ ధావన్ దేశ యువతకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది కొంతమందికి నచ్చలేదు. దీంతో ధావన్ లక్ష్యంగా తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

శిఖర్ ధావన్ ఎక్స్‌లో ‘‘మన యువత మన దేశ భవిష్యత్తు. వారి కలలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, కష్ట సమయాల్లో ఓర్పు వహించడం, మన సంస్థలను, ప్రభుత్వాన్ని విశ్వసించడం కూడా అంతే ముఖ్యం. ఓర్పుతో ప్రతి సవాలును అధిగమించవచ్చని నేను నమ్ముతున్నాను. భారతదేశం ఎల్లప్పుడూ పురోగమించింది, ఇకపైనా పురోగమిస్తూనే ఉంటుంది.’’ అని ఆయన ట్వీట్ చేశారు.

శిఖర్ ధావన్ పోస్టుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒయ యూజర్ ఇది కెరీర్‌కు సంబంధించిన విషమని, లక్షలాది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు సహనంగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. పేపర్ లీక్ వ్యవహారాన్ని ఖండించకపోవడం, ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవడంపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.