Reading Time: < 1 minute

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు మంత్రులు పవన్ కల్యాణ్, లోకేష్ పరామర్శ

Caption of Image.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి సెవెన్​ హిల్స్​ ఆస్పత్రిలో చికిత్సపొందుతన్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు.  ఈ ఘటనలో 8 మంది మరణించగా .. సూరిబాబు, పైడిరాజు, పి.శ్రీనివాసరావులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో , కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు.గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రిలో అందుతున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాయపడిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మంత్రులు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరమర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు.  ఆయనతో పాటు ఉన్న ఇంచార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. 

కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.  ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి నారాలోకేష్​ హామీ ఇచ్చారు.  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.