Reading Time: < 1 minute

10 రోజుల తర్వాత భారీగా పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాముకు ఎంత పెరిగిందంటే..?

Caption of Image.

దాదాపు రెండు వారాలుగా నెమ్మదించిన బంగారం రేట్లు మళ్లీ తిరిగి పుంజుకోవటం భారతీయ కొనుగోలుదారులను నిరాశ పరిచింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం తిరిగి స్టార్ట్ కావటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న గందరగోళాలు బులియన్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీశాయి. దీంతో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి రేట్లకు బ్రేకులు పడి తిరిగి వాటి ధరలు పెరగటం స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని ధరలను పరిశీలించటం బెటర్. 

జూన్ 9న బంగారం రేట్లు పెరిగాయి. జూన్ 8 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.147 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 316గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 040గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 9, 2026న దేశవ్యాప్తంగా మార్పులు లేకుండా కొనసాగుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పులు లేకుండా రూ.2లక్షల 70వేలుగానే కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.270 దగ్గర ఉంది.  

©️ VIL Media Pvt Ltd.