
గ్రహాల సంచారం ఆధారంగా కొన్ని రాశుల వారు కొన్ని పరిహారాలు చేస్తే చాలా శుభ పరిణామాలు చోటు చేసుకొంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారం ఆధారంగా ఆరు రాశుల ఏ పని అయినా కొద్దిపాటి ప్రయత్నంతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని పండితులు అంటున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా పండితులు ప్రస్తుతం ఎలా ఉంటుంది. ఫ్యూచర్ ఎలాఉందో.. జాతక చక్రంలో ఏ స్థానంలో ఏ గ్రహం సంచరిస్తుంది.. ఏ రాశిలో.. ఏ స్థానంలో ఉంది మొదలగు అంశాలను పరిగణనలోకి తీసుకొని లెక్కించి జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తునారు.
జ్యోతిష్యనిపుణులు తెలిపిన వివరాల ప్రకారం జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ తృతీయ స్థానం బలంగా ఉంటే కొద్దిపాటి ప్రయత్నంతో ఆశయాలు, ఆశలు, కలలు, కోరికలను సాకారం చేసుకోవడం జరుగుతుంది. ఈ స్థానం ప్రయత్నం, వృద్ధి, చొరవ, తెగువ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది.
ప్రస్తుతం మేషం, మిథునం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులకు తృతీయ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థికం, ఉద్యోగం, పెళ్లి, విదేశీయానం తదితర అంశాలకు సంబంధించి వీరు ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది.
మేషరాశి: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో జూన్ 15 వ తేదీ తరువాత సూర్యుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో తమ లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు. ఎప్పటినుంచో ఎదురుచేస్తున్న పనులు నెరవేరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు.. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
మిథునరాశి: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతువు, ఆ తర్వాత శుక్రుడు సంచరిస్తున్నందు వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి బాగా అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా జూలై ఆఖరు లోగా అనుకోని విజయాలు లభించే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి అనుకోకుండాఆర్డర్లు లభిస్తాయి. ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
ధనుస్సురాశి: ఈ రాశికి ప్రస్తుతం తృతీయ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. తక్కువ శ్రమ..ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. తమ లక్ష్యాలను సాధించుకోవడానికి, తమ ఆశల్ని నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది.
మకరరాశి: ఈ రాశికి తృతీయ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విగృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జూలై చివరి నాటికి ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు.
కుంభరాశి: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. అతి కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు విశేష లాభాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. వీరికి అనారోగ్యానికి తగ్గ సరైన చికిత్స లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది.
మీనరాశి: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ నెల 15 వరకు సూర్యుడు , 20 నుంచి కుజుడి సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.