
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ వస్తుందంటే చాలు టీవీల ముందు వాలిపోతారు ప్రేక్షకులు. వివిధ భాషల్లో ఈ రియాలిటీ షో నిర్వహిస్తున్నప్పటికీ తెలుగులో దీనికి ప్రత్యేకస్థానం ఉంది. గత సీజన్ 9 రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ల్యాండ్‌మార్క్ సీజన్ 10తో మన ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఎవరూ ఊహించని విధంగా చాలా ముందే ఈ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున అక్కినేని మరోసారి హోస్ట్‌గా పవర్‌ప్యాక్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రోమో రీసెంట్‌గా రిలీజ్ అవ్వడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ షేక్ అవుతోంది.
ఈసారి ‘దశావతారం’..
పదో సీజన్ కాబట్టి ఈసారి కాన్సెప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ‘బిగ్ బాస్ దశావతారం’ (Bigg Boss Dhasavatharam) థీమ్‌తో ఈ సీజన్ రాబోతోంది. అంటే ఈసారి ఒకటో రెండో కాదు.. ఏకంగా 10 విభిన్న అవతారాలు, సరికొత్త ట్విస్టులతో కంటెస్టెంట్లకు మైండ్ బ్లాక్ అయ్యే టాస్క్‌లు ఉండబోతున్నాయి. ప్రోమోలో నాగార్జున చెబుతూ.. ‘ఇది కేవలం ఆటలో ఛాలెంజ్ కాదు.. ఈ ఆటే ఒక పెద్ద ఛాలెంజ్’ అంటూ హింట్ ఇచ్చారు. అంటే రూల్స్, ఎలిమినేషన్స్, గేమ్ ఫార్మాట్ అన్నీ మునుపెన్నడూ చూడని విధంగా మారబోతున్నాయన్నమాట.
లీకైన బిగ్ బాస్ హౌస్ పిక్స్..
ఇంకా షో అధికారికంగా ప్రారంభం కాకముందే.. కొత్త బిగ్ బాస్ హౌస్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యి వైరల్‌గా మారాయి. ఈసారి ఇంటీరియర్ డిజైన్ మరింత కలర్‌ఫుల్‌గా, లగ్జరీగా ఉంది. పింక్, పర్పుల్, గోల్డ్ కలర్ కాంబినేషన్స్‌తో హౌస్ మెరిసిపోతోంది. లివింగ్ ఏరియాలో ఫ్లోరల్ వాల్‌పేపర్స్, బర్డ్ మోటిఫ్స్‌తో క్లాసిక్ లుక్ ఇచ్చారు. ఇక బెడ్‌రూమ్ , వాష్ రూమ్స్, కలర్‌ఫుల్ బెడ్స్, డిజైనర్ మిర్రర్స్, రిచ్ డెకర్‌తో హౌస్‌ను ఒక ప్యాలెస్‌లా మార్చేశారు.
ప్రసారం ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
ఎండెమాల్ షైన్ ఇండియా (Endemol Shine India – Banijay Entertainment) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ షో.. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. స్టార్ మా (Star Maa) ఛానల్‌లో ప్రసారం అవుతుంది. ఈసారి ఈ క్రేజీ షోను జియోహాట్‌స్టార్ (JioHotstar) ప్లాట్‌ఫామ్‌లో 24/7 లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు.
ప్రస్తుతానికి కంటెస్టెంట్ల లిస్ట్ సీక్రెట్‌గా ఉన్నప్పటికీ, టాలీవుడ్‌కి చెందిన కొందరు క్రేజీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇప్పటికే లైన్లో ఉన్నట్లు టాక్. మరి ఈ ‘దశావతారం’ హంగామా ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..