Reading Time: < 1 minute

రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి : కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు చిన్నారెడ్డి

Caption of Image.

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్‌లో ఖర్గేను కలిసి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో సమిష్టిగా పనిచేయడంతో 70 శాతం సర్పంచ్‌లు, 90 శాతం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామని వివరించారు.

అలాగే, రెండేండ్ల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంను తాను వెనక్కి ఇచ్చే సమయంలో తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ మేరకు పార్టీ తనకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చిన్నారెడ్డి కోరారు. 

©️ VIL Media Pvt Ltd.