Reading Time: < 1 minute

ట్రంప్ కు బిగ్ షాక్.. సుంకాలు చట్ట విరుద్దం:అమెరికా సుప్రీంకోర్టు

Caption of Image.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్.. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏకపక్షంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్దమని తేల్చింది. ట్రంప్ తన అధికారు పరిధిని దాటారని కోర్టు హెచ్చరించింది. 
 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్దమని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో  ఉద్దేశించిన చట్టాన్ని తన అధికార పరిధిని దాటి దుర్వినియోగం చేసిందని పేర్కొంది.  సుంకాల విషయంలో ట్రంప్ తీరు చట్ట విరుద్దమని  దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. 

1977 చట్టం ప్రకారం.. అమెరికా కాంగ్రెస్ కు సుంకాలను జారీచేసే అధికారం ఇచ్చింది అమెరికా రాజ్యాంగం. డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని మించి చట్టాన్ని ఉల్లంఘించారని దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును శుక్రవారం (ఫిబ్రవరి 20) అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ సంచలన తీర్పునిచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.