Reading Time: < 1 minute

సిద్దిపేటలో కాంగ్రెస్ నేత దారుణ హత్య

Caption of Image.

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది.  దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామ శివారులో పట్టపగలే  కాంగ్రెస్ నాయకుడు బాల్ రెడ్డి(50)  హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 20న  బైక్ పై వెళ్తోన్న బాల్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు  కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో బాల్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. 

 ఈ ఘటనతో  ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఘటన స్థలానికి  వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు.  క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షలు కానీ.. భూ వివాదాలు కానీ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

©️ VIL Media Pvt Ltd.